పైలెట్ పాస్‌పోర్టు మర్చిపోయాడు.. 5 గంటల పాటు నిలిచిన విమానం..

- August 09, 2016 , by Maagulf
పైలెట్ పాస్‌పోర్టు మర్చిపోయాడు.. 5 గంటల పాటు నిలిచిన విమానం..

పైలెట్ తన పాస్‌పోర్టు మర్చిపోయాడు. దీంతో విమానం దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా డామన్ వెళ్లాల్సిన విమానం బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం పెలైట్ తన పాస్‌పోర్టును వెంట తెచ్చుకోవటం మర్చిపోయాడు.
విమానాశ్రయ అధికారుల తనిఖీలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని వెంటనే బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులకు తెలిపారు. దాంతో సదరు పైలెట్ పాస్ పోర్టును మరో విమానంలో బెంగళూరు నుంచి తెప్పించారు. దీంతో విమానం ఆ తర్వాత డమన్ బయలుదేరింది. దీంతో విమానం దాదాపు 5 గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com