బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- June 08, 2026
మస్కట్: ఒమన్ లో వినియోగదారుల రక్షణ చట్టం మరియు దాని నిబంధనలను ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థను అధికారులు సీజ్ చేశారు. బార్కాలోని వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో కలిసి మహిళల టైలరింగ్ సేవలు అందించే ఒక సంస్థను తాత్కాలికంగా మూసివేసింది. ఆ సంస్థపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారం పూర్తయ్యే వరకు దాని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది.
ఒప్పందం ప్రకారం సేవలను అందించడంలో ఆ సంస్థ విఫలమైందని వినియోగదారుల నుండి అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు నోటీసులు జారీ చేసినా, వారు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.
అలాగే ఆ సంస్థపై నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను పాటించాలని అన్ని వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!









