బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- June 08, 2026
యూఏఈ: యూఏఈలోని బ్యాంకులు సాంప్రదాయ వన్-టైమ్ పాస్‌కోడ్‌లు (OTPలు) మరియు సెక్యూరిటీ పిన్‌ల నుండి పూర్తిగా వైదొలిగి, ఆన్‌లైన్ లావాదేవీల కోసం సాధారణంగా బయోమెట్రిక్ డేటాను ఉపయోగించే ఇన్-యాప్ ప్రామాణీకరణకు మారాయి. కస్టమర్ల భద్రతను మెరుగుపరచడానికి మరియు పెరుగుతున్న ఫిషింగ్, మోసాల కేసులకు చెక్ పెట్టేందుకు ఈ కీలక మార్పులు చేశారు. అయితే, బయోమెట్రిక్ వేరిఫికేషన్ దిశగా కొందరు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకింగ్, సైబర్ రంగ నిపుణులు పలు భద్రతా, గోప్యత పరమైన విషయాలను పంచుకున్నారు.
కంసెంట్, ప్రైవసీ ఆందోళనలు
బ్యాంకులు భద్రతా చర్యలను ఎందుకు బలోపేతం చేస్తున్నాయో తనకు అర్థమైందని దుబాయ్ నివాసి ఆన్ ఎం. అన్నారు. ఈ రోజుల్లో ఆన్ లైన్ మోసాలు సాధారణమైపోయారని అన్నారు. కానీ బయోమెట్రిక్ ప్రామాణీకరణను తప్పనిసరి చేయడం అనేది కంసెంట్, ప్రవైసీ మరియు బాధ్యతకు సంబంధించి తనకు ఆందోళనలను కలిగిస్తోందన్నారు. బయోమెట్రిక్ వేరిఫికేషన్ భద్రతపై ఈ మీడియా నిపుణురాలు సందేహం వ్యక్తం చేశారు. ఇది రిమోట్ మోసాల ప్రమాదాన్ని తగ్గించినప్పటికీ, యూజర్లు ఫిజికల్ బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ భద్రత సౌకర్యవంతంగా ఉండి, కొన్ని రకాల మోసాలను తగ్గించినప్పటికీ, వినియోగదారులు తమ సొంత ఆర్థిక లావాదేవీలను ఎలా యాక్సెస్ చేయాలో మరియు సురక్షితంగా ఉంచుకోవాలో ఎంచుకునే హక్కును కలిగి ఉండాలని దుబాయ్ నివాసి అన్నారు.
బయోమెట్రిక్స్‌ను మార్చడం మరింత కష్టం
బయోమెట్రిక్ వేరిఫికేషన్ సాధారణంగా OTPల కంటే సురక్షితమైనది. అయినప్పటికీ, నిరంతరం అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికతలు, సైబర్ ఫ్రాడ్స్ బయోమెట్రిక్స్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం అధికంగా ఉందని, డేటా చోరీతో కొత్త సమస్యలు తలెత్తవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మహేర్ యమౌట్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు బయోమెట్రిక్ డేటాను యాక్సెస్ చేయడాన్ని మరింత కష్టతరం చేయడానికి బ్యాంకులు దానిని ఎన్‌క్రిప్ట్ చేసి, సురక్షితంగా సేవ్ చేయాలని వివరించారు.
యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అధికారిక నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వినియోగదారుల డేటాను రక్షించాలి. అలాగే ఏవైనా భద్రతా ఉల్లంఘనలను గుర్తించడానికి వారి బయోమెట్రిక్ అప్లికేషన్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. దీనికి అత్యంత సురక్షితమైన మార్గంగా బయోమెట్రిక్‌లను పిన్‌లు లేదా ఇతర వేరిఫికేషన్ అంశాలతో కలపాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇది మల్టీ లేవల్ వేరిఫికేషన్ లను సృష్టిస్తుందని, ఇందులో వినియోగదారులు తమ గుర్తింపుకు సంబంధించిన బయోమెట్రిక్స్ కోసం పిన్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండు లేదా మూడు లెవల్లో వేరిఫికేషన్ ను ఉపయోగించడం వల్ల అనధికారికంగా డేటాను ఉపయోగించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని, ఆర్థిక లావాదేవీలకు, సున్నితమైన డేటాకు రక్షణ బలోపేతం అవుతుందని, ఈ దిశగా బ్యాంకులు భద్రతా పరమైన చర్యలు చేపట్టాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!









