‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది: డైరెక్టర్ బోయపాటి శ్రీను

- June 08, 2026 , by Maagulf
‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది: డైరెక్టర్ బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు(జూన్ 10) వేడుకలు సందర్భంగా రూపొందించిన "భోళా బాలయ్య" సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది.

భోళా బాలయ్య సాంగ్ లాంచ్ ఈవెంట్ లో  డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. బాలయ్య ఏంటనేది నేను నా సినిమాల ద్వారా చెప్పాను.ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, పాట చాలా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్, ఆర్టిస్టులు, అలాగే ఈ సాంగ్‌ను రూపొందించిన జగన్‌తో సహా అందరూ అద్భుతంగా కుదిరారు. ముఖ్యంగా విజువల్స్ అయితే చాలా గొప్పగా ఉన్నాయి. బాలయ్య చిన్నప్పటి ఫొటోల నుంచి ఇప్పటివరకు ఉన్న విజువల్స్‌ను చూస్తుంటే, పాట కంటే ఆ విజువల్స్‌తోనే ప్రేక్షకులు మరింత మమేకమైపోతారు.ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. జగన్ చాలా మంచి టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు.అతని కృషికి తప్పకుండా తగిన ఫలితం ఉంటుంది. బాలయ్య బాబుగారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే శుభాకాంక్షలు.ఈ పాటను లాంచ్ చేసే అవకాశం ఇచ్చిన అభిమానులందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. బాలయ్య బాబు ఎప్పుడూ ఇలాంటి అద్భుతమైన ఎనర్జీతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.ఏ క్యాలెండర్‌లోనూ లేని పండుగ, అభిమానుల గుండెల్లో మాత్రమే ఉండే పండుగ బాలయ్య బాబు పుట్టినరోజు. ప్రతి సంవత్సరం అభిమానులు ఆయన పుట్టినరోజును ఒక వేడుకలా జరుపుకుంటారు.ప్రతి ఏడాది అంతకుమించి చేస్తున్నారు.బాలకృష్ణ కూడా అభిమానులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ చూస్తుంటే ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా అనిపిస్తోంది.అభిమాన హీరో ఆనందంగా ఉండాలని, ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.అభిమానుల దీవెనలు ఎప్పుడూ ఆయనతోనే ఉంటాయి. బాలయ్య గారికి ఇష్టమైన పని కష్టపడటం.ఆయనకు ఇష్టమైనది సేవ. అభిమానులు కూడా దానిని బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం.ఇన్ని మంచి పనులు చేస్తున్న బాలకృష్ణ అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరూ ఎప్పుడూ బాలయ్య బాబుగారితోనే ఉండాలి. ఆయనతో కలిసి ముందుకు నడవాలి.బాలయ్య బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య!

ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్ మాట్లాడుతూ...కారణజన్ముడు, యుగపురుషుడు నందమూరి తారక రామారావు వారసుడు, మనందరి అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు మనందరికీ ఒక పండుగ రోజు. దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటామో,అలాగే బాలయ్య బర్త్‌డేను కూడా జూన్ 1 నుంచి 10 వరకు కన్నుల పండుగగా జరుపుకుంటాం.బాలకృష్ణ సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర, చేసిన సేవా కార్యక్రమాలు ఒక్కరోజులో చెప్పలేం. ఆయనకు అభిమానిగా ఉండడం, ఆయన వెంట నడవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. ఆయనతో గడిపిన ప్రతి నిమిషం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన.ఐదు రంగాల్లో ప్రతిరోజూ దాదాపు 20 గంటలు కష్టపడుతున్నారు.అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ దేశంలో లేరు. ఆయన స్వార్థం ఎరుగని మహోన్నత వ్యక్తి. ఏ అభిమాని కనిపించినా పలకరిస్తారు, వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆయన మమ్మల్ని అంతగా అభిమానిస్తున్నారు కాబట్టే ఇలాంటి పాటలు పుడుతున్నాయి. బాలకృష్ణ ని సింహంలా చూపించి ‘అఖండ’ వంటి విజయాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ సాంగ్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది.బాలయ్య వ్యక్తిత్వాని సరిపడేలా ఈ పాటకు ‘భోళా బాలయ్య’ అని నామకరణం చేశాం.బాలయ్య కి ఎంత సేవ చేసినా తక్కువే అని భావిస్తాను. మా నాన్నగారు మరణించిన తర్వాత నాకు తండ్రి స్థానంలో బాలయ్య గారే ఉన్నారు.బోయపాటి  సమక్షంలో ఈ సాంగ్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమలో బ్రేకప్‌లు ఉండొచ్చు, కానీ బాలయ్య బాబుని ప్రేమిస్తే ‘నో బ్రేకప్స్’...అది జీవితాంతం ఉంటుంది. దర్శకుడు శివాజీ ఈ పాటను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కరీముల్లా, రుచేరా వైద్య ఎంతో ఎనర్జీతో పాడారు.అలాగే ఈ సాంగ్ కోసం పనిచేసిన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  

లిరిసిస్ట్ దివాకర్ అమిలినేని మాట్లాడుతూ... అందరికీ నమస్కారం.బాలయ్య కోసం పాట రాస్తే అది జీవితాంతం నిలిచిపోయేలా ఉండాలని జగన్ గారు మాకు చాలా మంచి ఇన్‌పుట్ ఇచ్చారు. ‘బాలయ్య బాబు ఎలా ఉంటారో అలా రాయండి, అదే పాట’ అని చెప్పారు. ఆ ఆలోచనతోనే ఈ పాటను రాశాను.ఈ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను.బాలయ్య బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.అలాగే బాలయ్య బాబు అభిమానులందరికీ కృతజ్ఞతలు.మీ అందరి ఆశీర్వాదం నాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

సింగర్ కరీముల్లా మాట్లాడుతూ...అందరికీ నమస్కారం.బాలయ్య అంటే అనంతపురం జగన్ కి ఎంతో అభిమానం.నేను ఇంతకుముందు ‘వీరసింహారెడ్డి’లో ‘జై బాలయ్య’ పాట పాడాను. అలాగే ‘భగవంత్ కేసరి’లో గణేశ్ పాటను పాడాను. ‘అఖండ తాండవం’లో కూడా పాడే అవకాశం వచ్చింది.బాలయ్య అభిమానులు కలిసి రూపొందించిన పాటను కూడా పాడే అవకాశం మళ్లీ నాకే రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఈ అవకాశాన్ని ఇచ్చిన జగన్ కి, మా టీమ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రెజెంట్స్: NBK హెల్పింగ్ హ్యాండ్స్
సాహిత్యం: దివాకర్ అమిలినేని  
సంగీతం: ఈశ్వర్ దత్తు
గాయకులు: కరీముల్లా, రుచేరా వైద్య, ఎస్.ఎం. అఫ్సర్
మ్యూజిక్ కో-ఆర్డినేటర్: కుమార్ కడారి
దర్శకత్వం: శివాజీ వి.
కొరియోగ్రఫీ: పవన్ రాచర్ల
(DOP): చందన్ వేణిగెళ్ల
ఎడిటర్: వంశీ జె.ఆర్.
వీడియో ఎడిటర్: నవీన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com