నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- June 09, 2026
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డీఏ) నిబంధనలు పాటించని 1,753 ఆహార సంస్థలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకుంది. నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లేని 1,057 టన్నుల ఉత్పత్తుల ప్రవేశాన్ని అడ్డుకున్నట్లు అథారిటీ తెలిపింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్ఎఫ్డీఏ 12,260 సంస్థలలో 15,200 కంటే ఎక్కువ తనిఖీ పర్యటనలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా నిబంధనలు ఉల్లంఘించిన 1,753 సంస్థలను గుర్తించడం మరియు నిబంధనలకు అనుగుణంగా లేని 1,057 టన్నుల ఆహార ఉత్పత్తులను అడ్డుకోవడం జరిగిందని పేర్కొంది.
లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం, ఎస్ఎఫ్డీఏ ఆమోదించని ఉత్పత్తులను పంపిణీ చేయడం మరియు సంబంధిత సాంకేతిక నిబంధనలను ఉల్లంఘించడం వంటివి అత్యంత సాధారణ ఉల్లంఘనలలో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. లిస్టేరియా, సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి ఆహార సంబంధిత అనారోగ్యాలకు కారణమయ్యే సూక్ష్మజీవులతో ఉత్పత్తులు కలుషితం కావడమే ఈ నిషేధాలకు ప్రధాన కారణమని తెలిపింది. నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకు చేరకుండా నిరోధించడానికి తాము చేస్తున్న నిరంతరం ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నది. ఉల్లంఘనలకు విధించే శిక్షలలో వ్యాపారం మూసివేత, జైలు శిక్ష, లేదా SR10 మిలియన్ల వరకు జరిమానాలు ఉండవచ్చని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









