'సిగ్మా' ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్
- June 09, 2026
అతి తక్కువ సమయంలో 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన సందీప్ కిషన్, జేసన్ సంజయ్, ఎస్.తమన్, లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ ప్రజెంట్స్“సిగ్మా” ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ సాంగ్ అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంగీత ప్రియులు, యువత నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ పాట తెలుగు, తమిళ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఎనర్జీతో నిండిన బీట్, స్టైలిష్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో ‘సిగ్మా స్టైల్’ పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంది. సందీప్ కిషన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఫారియా అబ్దుల్లా తన గ్రేస్‌ఫుల్ క్లాసికల్-వెస్ట్రన్ ఫ్యూజన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. దర్శకుడు జాసన్ సంజయ్ స్టైలిష్ ఆన్‌స్క్రీన్ అప్పియరెన్స్ కూడా అలరించింది. క్యాచీ ట్యూన్, స్టైలిష్ ట్రీట్మెంట్, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌తో ఈ పాట యువతకు ఫేవరెట్‌గా మారింది.
లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా కనిపించనున్నారు. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు తాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, హరిహరసుతన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకుంది. త్వరలోనే ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను మేకర్స్ ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆదిలాబాద్‌లో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో భద్రతకు కొత్త దిశ: డీజీపీ ఆనంద్
- దుబాయ్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
- ‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్.. భద్రత, పనితీరు పై ప్రత్యేక దృష్టి
- ఇంటెల్లి స్మార్ట్ను కొనుగోలు చేస్తున్న అదానీ ఎనర్జీ.. రూ.3,050 కోట్ల ఒప్పందం
- మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్: సీఎం చంద్రబాబు
- ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్
- అజ్మాన్‌లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ









