సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- June 10, 2026
మనామా: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) బియాన్ అల్ దానా యాంఫిథియేటర్ సహకారంతో బహ్రెయిన్ సమ్మర్ టాయ్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇది జూలై 2 నుండి ఆగస్టు 5 వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో జరుగనుంది.
ఈ సంవత్సరం ఈవెంట్ కొత్త ఇంటరాక్టివ్ షోలతో అలరించనుంది. వీటిలో జులై 15 నుండి 18 వరకు జరిగే ‘ది హాంటెడ్ హౌస్’ అనే ప్రత్యక్ష ప్రదర్శన ఉంది. ఇది ఫెస్టివల్ కు ఉత్సాహాన్ని జోడించనుందని BTEA సీఈఓ సారా అహ్మద్ బుహెజ్జీ తెలిపారు. ఈ సంవత్సరం ఎడిషన్‌లో అన్ని వయసుల వారికి కొత్త ఆకర్షణలు, మరపురాని అనుభవాలు ఉన్నాయని తెలిపారు. షాన్ ది షీప్, ఫెల్ఫౌల్, జమాల్ జమాల్ మరియు జఘలీల్ నుండి ప్రేరణ పొందిన ప్రదర్శనలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఇంటరాక్టివ్ ప్రదర్శనలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.
అరబిక్ యానిమేటెడ్ క్లాసిక్‌లకు తన వాయిస్ తో గుర్తింపు తెచ్చిన రాషా రిజ్క్, అరబిక్ యానిమేషన్‌లో అత్యంత ప్రభావవంతమైన వాయిస్ లలో ఒకరైన తారెక్ అల్ అరబీ టూర్గానేతో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమిలియా జాబెర్ మరియు అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన మిస్ రాచెల్ షో స్ఫూర్తితో రూపొందించిన 'ఫన్ ఫర్ లిటిల్ వన్స్' అనే లైవ్ ప్రదర్శన కూడా ఉందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







