కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- June 10, 2026
కువైట్: కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ మేరకు కువైట్ అమీర్, షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో తాజా భద్రతా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. వారు ప్రాంతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్రిక్తతలు పెరగడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను ఖండించారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం అవసరమని పునరుద్ఘాటించారు.
కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం సంక్షేమం, భద్రతపై అమీర్ వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరులకు అందిస్తున్న సంరక్షణను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!









