'ప్రేమమ్‌' మధుర ప్రణయ కావ్యం...

- August 09, 2016 , by Maagulf
'ప్రేమమ్‌' మధుర ప్రణయ కావ్యం...

మలయాళంలో ఘనవిజయం సాధించి, విమర్శకుల మెప్పు పొందిన చిత్రం 'ప్రేమమ్‌'. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. నాగచైతన్య కథానాయకుడు. శ్రుతిహాసన్‌, మడొన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. చందు మొండేటి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈనెల 24న పాటల్ని విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఇదో చక్కటి దృశ్యకావ్యం. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాం. చైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలుస్తుంది. ఈనెల 18న తొలి పాట విడుదల చేస్తాం. వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, చైతన్య కృష్ణ ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com