సంక్రాంతి బరిలో 'శతమానం...'

- August 09, 2016 , by Maagulf
సంక్రాంతి బరిలో 'శతమానం...'

శ ర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. దిల్‌ రాజు నిర్మాత. వేగేశ్న సతీష్‌ దర్శకుడు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దిల్‌ రాజు మాట్లాడుతూ ''పది సంవత్సరాల క్రితం ఇదే రోజున 'బొమ్మరిల్లు' విడుదలైంది. ఆ చిత్రం మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చింది. 'శతమానం భవతి' అలాంటి మంచి కథే. 'బొమ్మరిల్లు' తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తాతామనవళ్ల ప్రేమానురాగాలతో నడుస్తుంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామ''న్నారు. ప్రకాష్‌రాజ్‌, జయసుధ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: మధు  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com