కువైట్‌లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!

- June 10, 2026 , by Maagulf
కువైట్‌లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!

కువైట్: కువైట్ లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు నమోదయ్యాయి. మే 31 నుండి జూన్ 6 మొత్తం 20,961 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ వ్యవహారాల విభాగం వెల్లడించింది.  

అధికారిక గణాంకాల ప్రకారం, 178 ప్రమాదాలలో గాయాలయ్యాయి.  కాగా 13 మంది మైనర్లను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అధికారులు 23 మందిని ముందుజాగ్రత్తగా అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, అత్యవసర పోలీసుల జనరల్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా గవర్నరేట్‌లలో విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా 1,173 ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేసి, 21 మందిని అరెస్టు చేసి సంబంధిత అధికారులకు అప్పగించింది. అధికారులు 12 వాంటెడ్ వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.  

అలాగే, గడువు ముగిసిన నివాస అనుమతులు ఉన్న ఐదుగురిని, అధికారిక గుర్తింపు పత్రాలు లేని తొమ్మిది మందిని అరెస్టు చేశారు 15 మంది అనుమానితులను మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి అప్పగించారు.  

అత్యవసర పోలీసులు 144 ట్రాఫిక్ ప్రమాద నివేదికలకు స్పందించి, తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 959 మందికి రోడ్డు పక్కన మానవతా సహాయం అందించారు.

ఇదిలా ఉండగా జూన్ 4 నుండి 7 వరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం 19,788 ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు 2,775 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదయ్యాయి. అధికారులు 40 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు.  76 మంది నివాస అనుమతి ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకున్నారు.  17 వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకుని, అధికారిక గుర్తింపు పత్రాలు లేని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను 251 వాహనాలను, 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com