ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ
- June 11, 2026
హైదరాబాద్: ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి,రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హద్దు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుంటానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఘన్హా మధ్య ద్వైపాక్షి క సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విసృతంగా చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్ పోర్ట్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టన్ ఒబువాడుంటానో వివరించారు.
ఘనా పారిశ్రామిక, ఆర్ధిక పరివర్తనకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబును విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…అనతి కాలంలోనే పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో కేంద్రంగా అంతర్జాతీయ ఎదిగిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను ఆయన వివరించారు. ఫార్మాన్యూటికల్ మ్యాను ఫ్యాక్చరింగ్, రీసెర్చ్, వ్యాక్సీన్ల తయారీ, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకున్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనా ప్రతినిధులకు చెప్పారు. మనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ ఒక నమ్మకైన భాగస్వామిగా ఉంటుందని భరోసానిచ్చారు.
తాజా వార్తలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!







