కువైట్ లో సాధారణ స్థితికి విమాన కార్యకలాపాలు..!!
- June 11, 2026
కువైట్: కువైట్ గగనతలంలో విమాన రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశ గగనతలంలో అత్యున్నత స్థాయి భద్రతను నిర్ధారించడానికి, కువైట్ మరియు విదేశాలలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు, పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని, విమానాలు షెడ్యూళ్ల ప్రకారం నడుస్తున్నాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తాజా సమాచారం మరియు అప్డేట్ల కోసం అధికారిక ఛానళ్లను ఫాలో కావాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







