డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..పలు వాహనాలు దగ్ధం..!!
- June 11, 2026
మనామా: బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. హమద్ టౌన్ మరియు మనామాలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, గాయపడిన బాలికకు సంఘటనా స్థలంలో చికిత్స అందించినట్లు, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పుతున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
అంతకుముందు, బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్‌లోని యుఎస్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే, బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే విజయవంతంగా అడ్డగించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్ ల శిధిలాలు నివాస ప్రాంతాల్లో పడటంతో నష్టం కలిగిందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







