రోస్టెడ్‌ మఖానా

- July 25, 2015 , by Maagulf
రోస్టెడ్‌ మఖానా

రోస్టెడ్‌ మఖానా
కావలిసిన పదార్ధాలు
ఫూల్‌ మఖానా - 3 కప్పులు
పసుపు - పావు టీస్పూను
కారం - అరటీస్పూను
ఛాట్‌ మసాలా - ఒక స్పూను
ఉప్పు - తగినంత
నూనె - 3 టీస్పూన్లు
తయారీ విధానం
ఫూల్‌ మఖానాను ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. వాటిని ఒక బాణలిలో నూనె వేసి ఉప్పు, కారం, పసుపు వేసి దానిలో ఫూల్‌ మఖానాలు వేసి సిమ్‌లో ఉంచి బాగా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. తరువాత దానికి ఛాట్‌ మసాలా వేసి సర్వ్‌ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు దానిమీద సన్నగాతరిగిన పచ్చి ఉల్లిముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర ముక్కలు కూడా వేసుకుని సర్వ్‌ చేసుకుంటే పిల్లలకు ఇష్టమైన ఈవినింగ్‌ స్నాక్‌ ఐటం రెడీ.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com