యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- June 13, 2026
యూఏఈ: యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ రంగ నిపుణులు హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలని సూచించారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం, ఇలాంటి కేసులలో నేరగాళ్లు సాంకేతికతను, తమ లక్ష్యాలపై చేసే విస్తృతమైన డేటా పరిశోధనతో బాధితులను నమ్మించి, మోసం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలు కేవలం యాదృచ్ఛికంగా చేసే మోసపు ప్రయత్నాల కంటే చాలా అధునాతనమైనవని దుబాయ్ విశ్వవిద్యాలయంలో సైబర్‌క్రైమ్ నిపుణుడు మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ క్లాడ్ ఫచ్ఖా తెలిపారు.
సైబర్ నేరగాళ్లు అత్యంత పర్సనల్ డేటాను సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, సోషల్ మీడియాతో పాటు ఇతర వనరుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. నేరగాళ్లు తరచుగా గత దరఖాస్తులు, హ్యాక్ చేయబడిన డేటాబేస్‌లు, ప్రయాణ పత్రాలు మరియు ఒపెన్ ప్లాట్ పారమ్స్ లలోఅందుబాటులో ఉన్న ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తారని ఆయన పేర్కొన్నారు.
బాధితుడి నుండి డబ్బు రాబట్టడానికి వారు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. మరింత పర్సనల్ గా సైబర్ దాడులను రూపొందించడానికి వారు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటారని పేర్కొన్నారు.
కాలర్ ఐడి స్పూఫింగ్
ఆధునిక సైబర్ క్రైమ్ కార్యకలాపాలు వ్యాపారాలను ఎక్కువగా పోలి ఉంటున్నాయని ఫచ్ఖా హెచ్చరించారు. డేటా సేకరణ, సోషల్ ఇంజనీరింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో వివిధ వ్యక్తులు నైపుణ్యం కలిగిన నెట్‌వర్క్‌లను ఆయన వివరించారు.
కెనడియన్ యూనివర్సిటీ దుబాయ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెహక్ ఖురానా మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు నిజమైన రాయబార కార్యాలయాల ఫోన్ నంబర్లను హ్యాక్ చేయడం చేయడం లేదని, వారు ఏదో సాంకేతికతను ఉపయోగిస్తున్నారని, ప్రాథమికంగా వారు ఫోన్ నంబర్లను స్పూఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా మోసగాళ్లు కాల్ అందుకునేవారి స్క్రీన్‌పై కనిపించే నంబర్‌ను తారుమారు చేయగలరని తెలిపారు. దీనివల్ల కాల్స్ రాయబార కార్యాలయాలు, పోలీస్ విభాగాలు లేదా బ్యాంకుల వంటి విశ్వసనీయ సంస్థల నుండి వచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు.
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత డేటా లభ్యత పెరగడం కూడా ఇలాంటి మోసాలను మరింత ఈజీ చేసిందన్నారు. మోసగాళ్లు తరచుగా వెబ్‌సైట్‌లు మరియు డార్క్ వెబ్ మార్కెట్‌ప్లేస్‌లలో యాక్టివ్ గా ఉన్న, గతంలో లీక్ అయిన డేటాసెట్‌లతో సహా పలు వనరుల నుండి సమాచారాన్ని సేకరిస్తారని ఖురానా అన్నారు. సాధారణంగా ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు మరియు ఇతర వ్యక్తిగత వివరాలు ఈజీగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వీటి సాయంతో మిగతా సమాచారాన్ని సేకరించి బాధితుడిని టార్గెట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తారని వివరించారు. భయం మరియు ఆత్రుత తరచుగా బాధితులను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయని హెచ్చరించారు.
సైబర్ ఫ్రాడ్స్ పంథా మారిందని, ఇప్పుడు ఏటీపీలు అడగడం లేదని, వాటి స్థానంలో వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు లేదా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోమని కోరతారు. లేదంటే కొన్ని సందర్భాల్లో రిమోట్-యాక్సెస్ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకునేలా ఒప్పిస్తారని, తద్వారా వారికి పరికరాలకు మరియు సున్నితమైన సమాచారానికి యాక్సెస్ లభిస్తుందన్నారు.
'ఫోన్ చేసి అడగండి'
అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించే లక్ష్యంతో టెక్నాలజీ కంపెనీలు మరియు టెలికాం ప్రొవైడర్లు సాధనాలను అభివృద్ధి చేస్తూనే ఉన్నప్పటికీ, ప్రజల అవగాహనే అత్యంత బలమైన రక్షణ మార్గమని నిపుణులు అంటున్నారు. సైబర్ నేరగాళ్లు షేర్ చేసిన ఫోన్ నంబర్లు, వెబ్ సైట్లను కాకుండా అధికారిక మార్గాల ద్వారా స్వతంత్రంగా ఆయా సంస్థలను సంప్రదించి, విషయాలను బేరీజు వేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఫోన్ కాల్ అధికారిక మూలం నుండి వచ్చినట్లు అనిపించినప్పటికీ, నివాసితులు ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు లేదా వన్-టైమ్ పాస్‌వర్డ్ లను ఎప్పుడూ పంచుకోవద్దని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెహక్ ఖురానా సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









