ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!
- June 14, 2026
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా బాధ్యతలు ముగించుకుని వెళ్తున్న జి.వి. శ్రీనివాస్.. భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పుడు పోలీసు ధృవీకరణకు లోబడి కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతోందని ప్రకటించారు. షెరటన్ ఒమన్ హోటల్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన 15 నెలల పదవీకాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఒమన్ దేశానికి, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించచినట్లు పేర్కొన్నారు.
అలాగే, తన పదవీకాలంలో ఒమన్ అధికారులు, ఇండియన్ కమ్యూనిటీ మరియు వివిధ వర్గాల నుండి లభించిన మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ లో జరిపిన విజయవంతమైన పర్యటన తన పదవీకాలంలో ముఖ్య ఘట్టాలలో ఒకటని శ్రీనివాస్ ప్రస్తావించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









