ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- June 14, 2026
కువైట్: ప్రభుత్వ స్టాంపులను నకిలీ చేసి, వాటి అధికారిక విలువ కంటే తక్కువ ధరలకు విక్రయించారన్న ఆరోపణలపై ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ జరిపిన దర్యాప్తు మరియు నిఘా సమాచారం ఆధారంగా, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ అరెస్టులను చేపట్టిందన్నారు.
ఈ ఐదుగురు సభ్యుల ముఠా అధికారిక ప్రభుత్వ స్టాంపులను ఫోర్జరీ చేసి, వాటిని చట్టవిరుద్ధ మార్గాల ద్వారా పంపిణీ చేయడంలో నైపుణ్యం కలిగి ఉందని పేర్కొంది. అనుమానితులు ఆసుపత్రుల పరిసరాల్లో నకిలీ స్టాంపులను విక్రయిస్తూ లాభాలు ఆర్జించడం కోసం KD 5 మరియు KD 10 విలువ గల స్టాంపులను వాటి అధికారిక విలువ కంటే తక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితుల నుంచి ఒక ల్యాప్టాప్, ఒక ప్రింటర్ మరియు స్టాంప్ పేపర్ రోల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







