యూఏఈ కార్మిక శిబిరంలో మనుగడ కోసం చెల్లించని భారతీయ కార్మికులు పోరాటం

- August 10, 2016 , by Maagulf
యూఏఈ కార్మిక శిబిరంలో మనుగడ కోసం చెల్లించని భారతీయ కార్మికులు పోరాటం

యూఏఈ ​కార్మిక శిబిరంలో మనుగడ కోసం చెల్లించని భారతీయ కార్మికులు పోరాటం  
పలువురు కార్మికులు  అబూధాబీలోని ముస్సఫహ్  కార్మిక శిబిరం వద్ద  చిక్కుకొని పోయారు.
వీరు 25 మంది కార్మికులు కాగా, వారిలో ఎక్కువగా భారతీయులు ఉన్నారు. , లెజెండ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టింగ్ ఎల్ ఎల్ సితో 10 నెలల కన్నా ఎక్కువ కాలంగా వేతనాలు  చెల్లించక పోవడంతో వారి మనుగడ దుర్భరంగా మారింది.లెజెండ్ ప్రాజెక్ట్ గ్రూప్ యొక్క భాగం  కాంట్రాక్టు సంస్థ సిరియన్ అబ్దుల్ మతీన్ అలలై , కంపెనీ జనరల్ మేనేజర్ నిర్వహిస్తున్నారు.కంపెనీ కార్మికులు తెలిపిన వివరాల  ప్రకారం, మార్చినుంచి ఈ కంపినీకు ఏ కొత్త ప్రాజెక్ట్ లభింప లేదు, అదే విధంగా కార్మికులపాస్పోర్ట్ లని కంపెనీ తిరిగి వారికి ఇవ్వడం లేదు. దీనితో ఇది చాలా కార్మికులు వీసా యొక్క చెల్లుబాటు గడువు తీరిపోయందని, ఇందుకు కార్మికులు భారీగా జరిమానా తప్పదని వారి వీసా పునరుద్ధరించక పోతే  ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీ వైఫల్యం వలన తమ పాస్పోర్ట్ లను అందవేమోనని కార్మికులు భయపడుతున్నారు.
వారు ఎవరంటే, నంద కిషోర్ ప్రసాద్, దిలీప్ సింగ్, ఉదిత్ నారాయణ్ గుప్తా,రవీందర్ కుమార్ షా బ్రెజీశ్  తివారి నాగేంద్ర సింగ్.ఈ సంస్థ లో  వీరు  రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు.గత నెలలో  వారి తోటి ఉద్యోగి హరి శంకర్ సింగ్ గుండెపోటు కారణంగా మరణించారు.ఇటువంటి స్థితిలో సంస్థ ఆయనకు చెందిన బకాయిలను చెల్లించడానికి స్వదేశానికి పంపే ప్రక్రియ నిధులు పెండింగ్లో ఉంచడం ఎంతో దారుణమని వాపోయారు.  " సంస్థలో  చనిపోయిన వ్యక్తికి చెందిన బకాయిలు చెల్లించ లేనపుడు  తాము ఈ కంపెనీ నుంచి ఏ విధమైన మంచితనం ఆశించగలమని " నంద కిషోర్ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు  వారు తమ  పరిస్థితి గూర్చి వ్యాఖ్యానిస్తూ, యూఏఈ గురించి తాము కన్న కలలు అన్ని కల్లలు అనే భావన  ప్రారంభమైందని  "సంస్థకు  కొంత కాలంగా పని దొరకని పరిస్థితి వచ్చిందని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com