భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- June 14, 2026
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను సమీక్షించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌తో కలిసి బేగంపేటలోని చికోటీ గార్డెన్ ప్రాంతాన్ని సందర్శించి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్ల పై నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించిన సీపీ, పరిస్థితులను దగ్గరుండి సమీక్షించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి, అవసరమైన చోట్ల తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సుమతి సూచించారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే మున్సిపల్, విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని సీపీ సుమతి విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే తమ ప్రాధాన్యమని, వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









