కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- June 14, 2026
కువైట్: కువైట్ లో అర్హులైన విదేశీ పెట్టుబడిదారులకు 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతులను పొందేందుకు వీలు కల్పించే కొత్త ప్రేమ్ వర్క్ ను కువైట్ కేబినెట్ ఆమోదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక అథారిటీ సిఫార్సు ఆధారంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ 15 సంవత్సరాల నివాస అనుమతిని జారీ చేస్తుంది.
ఈ రెసిడెన్సీ పథకం, అథారిటీ ఆమోదించిన పదవులలో ఉన్న పెట్టుబడి సంస్థల యజమానులు, భాగస్వాములు, మేనేజర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. కాగా, అర్హత సాధించడానికి, పెట్టుబడి సంస్థ DIPA జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పెట్టుబడి లైసెన్స్‌ను కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్‌ను కూడా అందించాలి.
పెట్టుబడి సంస్థ కనీసం KD 5 మిలియన్ల పెట్టుబడి పరిమాణాన్ని మరియు కనీసం KD 1 మిలియన్ మూలధనాన్ని కలిగి ఉండాలి. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన ఐదు పనిదినాలలోపు DIPA దరఖాస్తులను సమీక్షించి నిర్ణయం జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







