హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- June 14, 2026
హైదరాబాద్: తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, అయితే ఇవి వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
అదే విధంగా ఈ నెల 18 నుంచి 20 తేదీల మధ్య భారీ వర్షాలు(Telangana Rains) పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పనులు ప్లాన్ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణతో వాతావరణం మరింత చల్లబడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









