మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు..

- August 10, 2016 , by Maagulf
మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు..

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు సంభవించాయి. ఉదయం ఓ పేలుడు సంభవించగా.. ఇప్పుడు రెండోసారి బాంబు పేలింది. తాజాగా ఇంఫాల్‌లోని మణిపూర్‌ యూనివర్సిటీ గేట్‌ వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడినదీ లేనిదీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఉదయం 9 గంటల ప్రాతంలో ఇంఫాల్‌ ఈస్ట్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో ఐఈడీ పేలడంతో ఏడేళ్ల బాలిక గాయపడింది. మోయిరాంగ్‌ పురెల్‌ గ్రామంలో ఈ పేలుడు జరిగిందని.. గాయపడిన పాపను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పేలుళ్ల కారణంగా పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మోహరించారు. భద్రతను పెంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్లకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com