ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!

- June 16, 2026 , by Maagulf
ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!

మస్కట్: పిల్లలలో  సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్  సమగ్ర అధ్యయనానికి ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన నియంత్రణ చర్యలను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లలు మరియు టినేజర్లలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కుటుంబాలు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో మరియు సోషల్ మీడియాను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించేలా చూడటంలో నియంత్రణలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా డిజిటల్ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com