కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- June 16, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 (T4) ద్వారా గల్ఫ్, అరబ్ మరియు విదేశీ విమానయాన సంస్థల పరిమిత కార్యకలాపాలను పునఃప్రారంభించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. ప్రయాణికులకు సేవలు అందించడం, విమానయాన కార్యకలాపాల కొనసాగింపునకు మద్దతు ఇవ్వడం తమ జాతీయ బాధ్యత అని ఒక ప్రకటనలో డీజీసీఏ తెలిపింది. విమానయాన సంస్థలతో మాట్లాడి, కార్యాచరణ షెడ్యూళ్లను నిర్ధారించి, టెర్మినల్ ద్వారా సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామని DGCA తెలిపింది.
కువైట్‌కు రాకపోకలు సాగించే పౌరులు మరియు నివాసితుల ప్రయాణ అవసరాలను తీర్చడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు. అలాగే తమ సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







