యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- June 16, 2026
యూఏఈ: కొత్త ఇస్లామిక్ సంవత్సరం (1448 AH) ఆరంభాన్ని సూచించే మొహర్రం నెల నేటి నుంచి ప్రారంభమైందని యూఏఈ ఫత్వా కౌన్సిల్ ప్రకటించింది. నెలవంక దర్శనానికి సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని సమీక్షించిన తర్వాత ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. అంతకుముందు, అబుదాబి ఆకాశంలో పగటిపూట 'ఖత్మ్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ' ద్వారా నెలవంక కనిపించినట్లు యూఏఈ ఖగోళ శాస్త్ర కేంద్రం (Astronomy Centre) వెల్లడించింది.
ఇస్లామిక్ లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్రమానంపై ఆధారపడి ఉంటుంది. చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడే మొహర్రం మొదటి రోజుతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. హిజ్రీ క్యాలెండర్‌లోని ప్రతి నెల 29 లేదా 30 రోజులు ఉంటుంది. కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం సెలవుదినాన్ని ప్రకటించింది. దీంతో సాధారణంగా శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు తీసుకునే వారికి ఇది మూడు రోజుల సెలవుగా మారింది. షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థులు నాలుగు రోజుల సెలవును పొందనున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







