బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- June 16, 2026
రియాద్: బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఆరేళ్ల సౌదీ బాలుడి అవయవాలు.. బురైదాలో నలుగురు రోగుల ప్రాణాలను కాపాడాయి.బాలుడి కుటుంబం అవయవ దానానికి అంగీకరించడంతో.. నాలుగురికి విజయవంతంగా అవయవాలను అమర్చారు. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు రోగులకు ప్రయోజనం చేకూరింది. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు చెందిన ఒక ప్రత్యేక బృందం, బురైదాలోని మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో కలిసి ఆ బాలుడి నుండి అవయవాలను సేకరించింది.
ఒక పది నెలల పసికందుకు గుండెను అమర్చారు. లివర్ వైఫల్యంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు లివర్ ను, 37 మరియు 21 ఏళ్ల వయస్సు గల ఇద్దరు రోగులకు మూత్రపిండాలను మార్పిడి చేసినట్టు సౌదీ అవయవ మార్పిడి కేంద్రం డైరెక్టర్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు.ఈ సందర్భంగా మరణించిన బాలుడి కుటుంబం తీసుకున్న ప్రాణరక్షక నిర్ణయానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







