బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!

- June 16, 2026 , by Maagulf
బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!

రియాద్: బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఆరేళ్ల సౌదీ బాలుడి అవయవాలు.. బురైదాలో నలుగురు రోగుల ప్రాణాలను కాపాడాయి.బాలుడి కుటుంబం అవయవ దానానికి అంగీకరించడంతో.. నాలుగురికి విజయవంతంగా అవయవాలను అమర్చారు. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు రోగులకు ప్రయోజనం చేకూరింది. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు చెందిన ఒక ప్రత్యేక బృందం, బురైదాలోని మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో కలిసి ఆ బాలుడి నుండి అవయవాలను సేకరించింది.
ఒక పది నెలల పసికందుకు గుండెను అమర్చారు. లివర్ వైఫల్యంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు లివర్ ను, 37 మరియు 21 ఏళ్ల వయస్సు గల ఇద్దరు రోగులకు మూత్రపిండాలను మార్పిడి చేసినట్టు సౌదీ అవయవ మార్పిడి కేంద్రం డైరెక్టర్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు.ఈ సందర్భంగా మరణించిన బాలుడి కుటుంబం తీసుకున్న ప్రాణరక్షక నిర్ణయానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com