నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం

- August 10, 2016 , by Maagulf
నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం

సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలు, నిర్మాణంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమీపంలోని నిఆసితులు, జైదా ఫ్లై ఓవర్‌ వద్ద పొగను చూసినట్లు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఉదయం 6.30 నిమిషాల సమయంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఈ వ్యవహారంపై స్పందించి, స్పష్టతనిచ్చింది. అల్‌ ఫహాద్‌ ఫుడ్‌ సెంటర్‌ సమీపంలోని సల్వా రోడ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తేల్చింది. దోహాలో నెల రోజుల వ్యవధిలో ఇది మూడో అగ్ని ప్రమాదం, అదీ నిర్మాణంలో ఉన్న భవనం అగ్ని ప్రమాదానికి గురికావడం. ఈ నెల రెండవ తేదీన అన తుమ్మా ఏరియాలో ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురయ్యింది. జులైలో దహల్‌ అల్‌ హమామ్‌ పార్క్‌ సమీపంలోని తవార్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com