గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న పుష్కరాలు
- August 10, 2016
కృష్ణా పుష్కరాలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదుల సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మూడురోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన మంత్రి పలువురు ప్రముఖులకు పుష్కరాల ఆహ్వాన పత్రాలు అందజేశారు. రేపటి పుష్కరాల ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రికి వెయ్యి మంది కళాకారులతో ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 170 ఘాట్లలో 43 ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







