రాఖీ పండుగని సైనికులతో జరుపుకోనున్న స్మృతిఇరానీ
- August 10, 2016
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకొనే రాఖీ పర్వదినాన్ని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ మరింత ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం అహర్నిశలు శ్రమించే సైనికులతో ఈ వేడుకలు చేసుకోనున్నారు. రాఖీ పర్వదినాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ హిమనీనదానికి స్మృతి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆగస్టు 18న సియాచిన్ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నుంచి స్మృతి ఇరానీకి అనుమతి లభించింది.
స్మృతి పర్యటన కోసం ఆర్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనుంది. స్మృతి ఇరానీ గాక.. మరో 8 మంది భాజపా మహిళా ఎంపీలు కూడా దేశ సరిహద్దుల్లో రాఖీ పండగ జరుపుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరు రాజస్థాన్, కశ్మీర్‌లలోని సరిహద్దులకు వెళ్లి జవాన్లకు రాఖీ కట్టనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







