సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురవుతున్నారు..!!
- June 19, 2026
రియాద్: సౌదీ అరేబియాలో 15 ఏళ్లలోపు పిల్లలలో సుమారు 65 శాతం మంది తమ వయసుకు తగని సినిమాలు, గేమ్‌లు లేదా ఇతర కంటెంట్ కు గురవుతున్నారు. ఈ మేరకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక తెలియజేసింది. "ది నెక్ట్స్ జెనరేషన్ సౌదీస్: చైల్డ్ వుడ్ ఇన్ సౌదీ అరేబియా" అనే టైటిల్ లో ఉన్న ఈ నివేదిక, 2025లో సౌదీ సొసైటీటీ పేరుతో సౌదీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్, సలేహ్ కామెల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్, అల్-ముహైదిబ్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి.
ఎలక్ట్రానిక్ గేమింగ్ వాతావరణంలో పాల్గొనే పిల్లలు, వివిధ వయసుల వ్యక్తులతో సంభాషణలకు, అలాగే వారి అభివృద్ధి దశకు తగని భాష మరియు అంశాలకు గురవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డిజిటల్ ఫ్రెండ్స్ భావనను ఎక్కువగా అంగీకరిస్తున్నారని, అటువంటి వర్చువల్ సహచరులతో వారి సంభాషణకు మద్దతు కూడా ఇస్తున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది.
అదే సమయంలో, కొన్ని ప్రతికూల అనుభవాల కారణంగా కొంతమంది పిల్లలు ఈ రకమైన స్నేహం పట్ల ప్రతికూల అభిప్రాయాలను పెంచుకోగా, మరికొందరు సంభాషణలో సవాళ్లు మరియు అస్థిరతను పేర్కొంటూ డిజిటల్ స్నేహాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







