మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- June 19, 2026
మనామా: మానవ అక్రమ రవాణా కేసులో ఒక ఆసియా మహిళను దోషిగా నిర్ధారించిన కోర్టు, ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక మహిళను చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనేందుకు బలవంతం చేయడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. హై క్రిమినల్ కోర్టు ఆమెకు 2,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా కూడా విధించింది. బాధితురాలిని స్వదేశానికి పంపించే ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. అలాగే, శిక్షాకాలం పూర్తయ్యాక శాశ్వతంగా దేశం నుండి బహిష్కరించాలని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ నుండి ఒక నివేదిక అందిన తర్వాత ఈ కేసు ప్రారంభమైంది. బాధితురాలిని లైంగిక దోపిడీకి గురిచేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలలోకి బలవంతంగా లాగారని అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. బాధితురాలిని, మానవ అక్రమ రవాణా నిరోధక జాతీయ కమిటీ ఆధ్వర్యంలోని ఒక ఆశ్రయంలో పెట్టి సహాయ సహకారాలు అందజేశారు.
తాజా వార్తలు
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ







