సెప్టెంబర్ 2నుంచి ప్రారంభంకానున్నహజ్యాత్ర
- July 25, 2015
ప్రవిత హజ్‌యాత్ర-2015 సెప్టెంబర్ 2 తేదీ నుంచి మొదలుకానుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ. షూకుర్ తెలిపారు. శనివారం 2015 హజ్ షెడ్యూల్ వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ కమిటీ ఇరురాష్ర్టాల నుంచి ఎంపికైన హజ్ యాత్రికులు 16 ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాల ద్వారా వెళ్తారన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే యాత్రికులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సోమవారం నుంచి నాలుగురోజుల పాటు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హజ్‌కు వెళ్లే ప్రతీ యాత్రికుడు టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కవర్ నెంబర్ క్రమసంఖ్య ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి హజ్ యాత్రకు ఎంపికైన వారికి మాత్రమే టీకాలు ఇస్తామన్నారు. రోజు 500 మంది చొప్పున మూడు రోజులు 1500 మందికి టీకాలు ఇస్తామన్నారు. ఆగస్టు నెలలోని మొదటి వారంలో హజ్ యాత్రికులకు సూట్‌కేసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నెలలోనే టెండర్ల్ కమిటీ ద్వారా టెండర్ల ప్రక్రియ, ప్రభుత్వ శాఖ సమన్వయ సమావేశం, హజ్ టర్మిన్ల సందర్శన ఉంటుందన్నారు. ఈ ఏడాది హజ్ క్యాంప్ ఆగస్టు 30వ తేదీ లోపు ప్రారంభిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







