హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!

- June 21, 2026 , by Maagulf
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!

దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఉచితంగా ఉపయోగించుకునే పిల్లల స్ట్రోలర్లను అందుబాటులో తీసుకొచ్చినట్లు  ప్రకటించారు. >ఈ ఉచిత సేవ కోసం ఎటువంటి ముందస్తు బుకింగ్ లేదా సమయ పరిమితి అవసరం లేదని, అలాగే దీనికి ఎటువంటి రుసుము కూడా లేదని విమానాశ్రయం తెలిపింది. దీనివల్ల తల్లిదండ్రులు మోయాల్సిన సామాను భారం తగ్గడమే కాకుండా, తమ ప్రయాణాన్ని మరింత స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సేవ కాన్‌కోర్స్ A, B, C, D మరియు E లలో ఏర్పాటు చేసిన 'స్ట్రోలర్ నెస్ట్స్' (Stroller Nests) వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com