ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- June 21, 2026
కరీంనగర్: కరీంనగర్ జ్యోతినగర్‌లోని ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తండ్రి ప్రాముఖ్యత, కుటుంబం మరియు సమాజంలో ఆయన పాత్ర, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా తండ్రి ప్రేమ, త్యాగం, అంకితభావాన్ని ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. తండ్రి మన జీవితంలో మొదటి స్నేహితుడు, గురువు, మార్గదర్శి, దైవస్వరూపుడని ఉపాధ్యాయులు వివరించారు. పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకునే తొలి వ్యక్తి తండ్రేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఎలగందల వరదారెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పిల్లలకు తండ్రి గొప్పతనం తెలియజేయడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
పాఠశాల డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం, జోనల్ అధికారి సచిన్, ప్రధానోపాధ్యాయురాలు నాగ ప్రణవి మాట్లాడుతూ, విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించే కార్యక్రమాలకు ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని ఫాదర్స్ డే వేడుకలను విజయవంతం చేశారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







