ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!

- June 21, 2026 , by Maagulf
ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!

కౌలాలంపూర్: ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను ఎదుర్కోవడానికి ఇంధన భద్రతలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి తమ దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇండోనేషియా ఆర్థిక వ్యవహారాల సమన్వయ మంత్రి ఎయిర్లాంగా హర్టార్టో, ఇండోనేషియాలోని కువైట్ రాయబారి ఖలీద్ అల్-యాసిన్ తెలిపారు. జకార్తాలో వీరు సమావేశం అయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండోనేషియా, కువైట్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన భద్రతా రంగంలో విస్తరించడానికి చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇండోనేషియా వ్యాప్తంగా ఎనిమిది చమురు, గ్యాస్ అన్వేషణ ప్రాజెక్టులలో కువైట్ ఫారిన్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ (KUFPEC) పాల్గొనడంతో సహా, రెండు దేశాల మధ్య ఇంధన సహకారంలో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు.

2019లో చమురు, గ్యాస్ మరియు పెట్రోకెమికల్స్‌పై సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU) ద్వారా రెండు దేశాలు తమ ఇంధన సహకారం పెరిగిందని ఇండోనేషియా ఆర్థిక వ్యవహారాల సమన్వయ మంత్రి తెలిపారు. ఇంధన రంగానికి అతీతంగా, ఇండోనేషియా మరియు కువైట్‌లు అనేక అవగాహన ఒప్పందాలను కలిగి ఉన్నాయని కువైట్ రాయబారి అల్-యాసిన్ తెలిపారు.  2024లో 547.5 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉన్న మొత్తం వాణిజ్యం, 2025లో 10.69 శాతం పెరిగి 606 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరడంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలలో గణనీయమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు ప్రధానంగా చమురు మరియు గ్యాస్ రంగం కారణంగా, ఇండోనేషియాలో కువైట్ పెట్టుబడులు కూడా 2024లోని 2,90,000 డాలర్ల నుండి 2025 నాటికి 1.2 మిలియన్ డాలర్లకు పెరిగాయన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com