ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- June 21, 2026
: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు సైబరాబాద్ సీపీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. "Yoga for Wellness, Readiness & Resilience" అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్., ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తో పాటు సుమారు 250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు.
అనంతరం సీపీతో పాటు అధికారులు, సిబ్బంది యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్ మాట్లాడుతూ...యోగా అనేది భారతీయ నాగరికత ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
పోలీసు విధుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అత్యంత ముఖ్యమని సీపీ తెలిపారు. “A Calm Mind, A Strong Body, A Safer Society” అనే సందేశంతో ప్రతి పోలీసు అధికారి ఆరోగ్యవంతమైన శరీరం, ఏకాగ్రత కలిగిన మనస్సును పెంపొందించుకోవాలని సూచించారు. యోగా ద్వారా మానసిక బలం పెరిగి, ప్రశాంతమైన మనస్సుతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
శ్వాసపై ధ్యాస కేంద్రీకరించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారి, ఒత్తిడిని అధిగమించే శక్తి లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగా, ప్రాణాయామం, ధ్యానం (మెడిటేషన్) కోసం కేటాయించాలని సూచించారు.
పోలీస్ విధులు అధిక ఒత్తిడితో కూడుకున్నవని, అందువల్ల ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సీపీ సూచించారు. “Fearless Service – Fit Force, Focused Mind” అనే లక్ష్యంతో శారీరక దృఢత్వం, భావోద్వేగ సమతుల్యత, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఆరోగ్యవంతమైన పోలీసు వ్యవస్థ ద్వారానే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని, “Better Health – Better Policing” అనే సందేశాన్ని అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్‌లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







