ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- June 21, 2026
దోహా: ఖతార్ మూడవ ఆర్థిక రంగ వ్యూహానికి అనుగుణంగా.. లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, సేవలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖతార్ వ్యాప్తంగా ఉన్న ATMలలో 'ఆపిల్ పే' (Apple Pay) ద్వారా జాతీయ కార్డు 'హిమ్యాన్' (HIMYAN) 'టోకనైజేషన్' (tokenization) ఫీచర్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది.
ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు ఫిజికల్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నగదు ఉపసంహరణలు మరియు బ్యాలన్స్ ఎక్వైరీ (balance inquiries) వంటి పనులు చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు మద్దతునిచ్చే ATMల వద్ద లేదా దేశంలోని ఇతర బ్యాంకులకు చెందినవైనా సరే ఈ సేవను పొందవచ్చు.</p>
జాతీయ కార్డు 'హిమ్యాన్' (HIMYAN) డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భద్రత మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించడం, అలాగే ఖతార్‌లోని చెల్లింపుల రంగంలో డిజిటల్ పరివర్తన దిశగా సాగుతున్న మార్పులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రవక్త మహ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 28న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సెలవు
- వైజాగ్ వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్
- వందే మాతరం ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష
- యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు
- హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- ధోఫార్‌లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!
- ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!
- డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!
- 5 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించిన కువైట్..!!







