ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!

- June 21, 2026 , by Maagulf
ఖతార్ లో \'ఆపిల్ పే\' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!

దోహా: ఖతార్ మూడవ ఆర్థిక రంగ వ్యూహానికి అనుగుణంగా.. లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, సేవలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖతార్ వ్యాప్తంగా ఉన్న ATMలలో 'ఆపిల్ పే' (Apple Pay) ద్వారా జాతీయ కార్డు 'హిమ్యాన్' (HIMYAN)  'టోకనైజేషన్' (tokenization) ఫీచర్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది.

ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు ఫిజికల్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నగదు ఉపసంహరణలు మరియు బ్యాలన్స్ ఎక్వైరీ (balance inquiries) వంటి పనులు చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు మద్దతునిచ్చే ATMల వద్ద లేదా దేశంలోని ఇతర బ్యాంకులకు చెందినవైనా సరే ఈ సేవను పొందవచ్చు.</p>

జాతీయ కార్డు 'హిమ్యాన్' (HIMYAN) డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భద్రత మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించడం, అలాగే ఖతార్‌లోని చెల్లింపుల రంగంలో డిజిటల్ పరివర్తన దిశగా సాగుతున్న మార్పులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్  పేర్కొన్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com