డీఎండీకే అధినేత విజయకాంత్‌కు నాన బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌..

- August 10, 2016 , by Maagulf
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు నాన బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌..

ముఖ్యమంత్రి జయలలితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసులో వరుసగా విచారణకు గైర్హాజరవుతున్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కు పెరంబలూరు జిల్లా కోర్టు నానబెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 2012 ఆగస్టు 14న పెరంబలూరులో జరిగిన బహిరంగసభలో విజయకాంత ఏఐడీఎంకే అధినేత్రి జయలలితపై విమర్శల వర్షం కురిపించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ న్యాయవాది కె.కులోత్తుంగ పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి జరుగుతున్న విచారణకు విజయకాంత ఏనాడూ హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఎ.నజీమ్‌ భాను బుధవారం విజయకాంతకు నాన బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com