కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ..

- August 10, 2016 , by Maagulf
కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయనే విషయాన్ని తాజాగా వచ్చిన 'కబాలి' చాటిచెప్పింది. ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా రజనీ ఎలా కలెక్షన్ల వర్షం కురిపిస్తారోనన్న విషయం కూడా స్పష్టమైంది. 'కబాలి' అనంతరం శంకర్‌ దర్శకత్వంలో ఆయన '2.ఓ'లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తర్వాత తన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య తన తండ్రికి సంబంధించి ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా సినిమా తీయాలని యోచిస్తున్నారు. మెగాప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరులో సినిమా ఆరంభమయ్యే అవకామున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్‌ హీరోగా సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌' అనే మోషన్‌ క్యాప్చర్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com