సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!

- June 22, 2026 , by Maagulf
సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!

మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో సౌత్ అల్ బతినా సమ్మర్ 2026 ఫోరమ్ కార్యకలాపాలు రంభమయ్యాయి. గవర్నరేట్‌లోని కల్చర్, స్పోర్ట్స్ మరియు యువజన శాఖ సహకారంతో సౌత్ అల్ బతినా గవర్నర్ కార్యాలయం నిర్వహిస్తున్న ఈ ఫోరమ్ లో గవర్నరేట్‌లోని వివిధ విలాయత్‌ల నుండి వెయ్యి మందికి పాల్గొంటున్నారు. ఇది జూలై 2 వరకు కొనసాగుతుంది.

పిల్లలు, యువత సామర్థ్యాలను పెంపొందించడానికి సమ్మర్ హాలీడేస్ ను ఉపయోగించుకోవడమే ఈ ఫోరమ్ లక్ష్యమని నిర్వాహకులు ప్రకటించారు.  ఈ ఫోరమ్‌ను గవర్నరేట్‌లోని పలు విద్యా మరియు క్రీడా కేంద్రాలు, సెంటర్లలో నిర్వహిస్తున్నారు. 8 నుంచి 16 సంవత్సరాల వయసు గల వారికి టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్, కల్చర్, హెరిటేజ్ మరియు స్పోర్ట్స్ సంబంధిత కార్యక్రమాలు, వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు.  వీటితోపాటు డిజిటల్ కోర్సులతో పాటు  పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ కోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్, 3D ప్రింటింగ్, AI పయనీర్స్ ప్రోగ్రామ్ మరియు రోబోట్ అసెంబ్లీ వర్క్‌షాప్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com