కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- June 22, 2026
కువైట్: కువైట్ లో బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల రంగాల నియంత్రణకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. ఈ పరిశ్రమల్లోని లావాదేవీలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది.
సవరించిన కొత్త రూల్స్ ప్రకారం.. యాజమాన్య బదిలీ లేదా బంగారం అమ్మకం లేని సందర్భాలలో గోల్డ్ షాపులు, వర్క్‌షాప్‌ల మధ్య బంగారం సరఫరా ఎక్ఛేంజ్ కు గతంలో అనుమతించిన నిబంధనను మంత్రిత్వ శాఖ తొలగించింది.
అలాగే, యాజమాన్య బదిలీ ద్వారా వినియోగదారులు మరియు లైసెన్స్ పొందిన బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల వ్యాపారుల మధ్య బంగారంపై లావాదేవీలను నిషేధించారు. వినియోగదారుడు పాత బంగారాన్ని మార్చుకోవడానికి, దుకాణాలు పాత బంగారం కొనుగోలు విలువను వినియోగదారుడి ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కస్టమర్ తన బ్యాంకు అకౌంట్ నుండి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసి మొత్తం మొత్తాన్ని చెల్లించాలి. వీటిని రెండు వేర్వేరు లావాదేవీలుగా పరిగణిస్తారు. లావాదేవీ తేదీ, బంగారం బరువు, స్వచ్ఛత (క్యారెట్) మరియు విలువతో సహా అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సిందేనని మంత్రిత్వశాఖ తన గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మనీలాండరింగ్ నిరోధక మరియు పారదర్శకత చర్యలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. వీటిలో భాగంగా నగదు లావాదేవీలపై నిషేధం, ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సాహించడం, KD 3,000 మించిన లావాదేవీల కోసం కస్టమర్ గుర్తింపు వివరాలను సేకరించడం వంటివి ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







