మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- June 22, 2026
మనమా: అషూరా 1448 AH సందర్భంగా వైద్యపరమైన ఏర్పాట్లలో భాగంగా.. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్ మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అందిస్తున్న మద్దతుకు మరియు ప్రధాన మంత్రి, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు డాక్టర్ హసన్ కృతజ్ఞతలు తెలిపారు.
అషూరాలో పాల్గొనేవారికి సమగ్ర వైద్య సేవలను అందించడానికి ఈ క్లినిక్ ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తక్షణమే స్పందించేలా అవసరమైన వైద్య సామాగ్రి, మందులు మరియు పరికరాలతో ఈ క్లినిక్ సన్నద్ధంగా ఉందని తెలిపారు. పౌరులు మరియు నివాసితులకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో క్లినిక్ సిబ్బంది మరియు వాలంటీర్ల పనితీరును అభినందించారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







