మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!

- June 22, 2026 , by Maagulf
మనమాలో \'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్\' ప్రారంభం..!!

మనమా: అషూరా 1448 AH సందర్భంగా వైద్యపరమైన ఏర్పాట్లలో భాగంగా.. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్ మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అందిస్తున్న మద్దతుకు మరియు  ప్రధాన మంత్రి, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు డాక్టర్ హసన్ కృతజ్ఞతలు తెలిపారు.

అషూరాలో పాల్గొనేవారికి సమగ్ర వైద్య సేవలను అందించడానికి ఈ క్లినిక్ ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తక్షణమే స్పందించేలా అవసరమైన వైద్య సామాగ్రి, మందులు మరియు పరికరాలతో ఈ క్లినిక్ సన్నద్ధంగా ఉందని తెలిపారు. పౌరులు మరియు నివాసితులకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో క్లినిక్ సిబ్బంది మరియు వాలంటీర్ల పనితీరును అభినందించారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com