యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- June 22, 2026
అజ్మాన్: యూఏఈలో వైద్య నిర్ధారణ సేవల రంగంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న థంబే ల్యాబ్స్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఉత్తర ఎమిరేట్స్‌లో అతిపెద్ద అకాడమిక్ డయాగ్నస్టిక్ రిఫరల్ ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన తుంబే ల్యాబ్స్, తాజాగా ISO 15189:2022 అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపును సాధించింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక కాలేజ్ ఆఫ్ అమెరికన్ పాథాలజిస్ట్స్ (CAP) గుర్తింపు కలిగిన ఈ సంస్థ, ఇప్పుడు రెండు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను ఒకేసారి కలిగి ఉన్న అరుదైన ల్యాబొరేటరీల జాబితాలో చేరింది.
2001లో తుంబే గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ థంబే మొయిదీన్ దూరదృష్టితో ప్రారంభించిన ఈ ప్రయాణం, ఒక చిన్న ల్యాబ్ నుంచి నేడు ఐదు ల్యాబ్‌ల నెట్‌వర్క్‌గా విస్తరించింది. ప్రస్తుతం అజ్మాన్‌లోని తుంబే మెడిసిటీలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక డయాగ్నస్టిక్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తూ, యూఏఈ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది.
గత 25 ఏళ్లలో తుంబే గ్రూప్‌కు చెందిన ఆసుపత్రుల్లో 1.9 కోట్లకు పైగా రోగులకు చికిత్స అందించడంలో, లక్ష మందికిపైగా శిశువుల జనన సేవల్లో తుంబే ల్యాబ్స్ కీలక పాత్ర పోషించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోజుకు 15,000 వరకు పరీక్షలు నిర్వహిస్తూ ప్రాంతీయ మాలిక్యులర్ టెస్టింగ్ కేంద్రంగా సేవలందించింది. ఇప్పటివరకు 175కిపైగా దేశాలకు చెందిన ప్రజల కోసం సుమారు 3 కోట్లకు పైగా పరీక్షలను నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది.
ISO 15189:2022 గుర్తింపు వైద్య ప్రయోగశాలల నాణ్యత, సాంకేతిక సామర్థ్యాలకు సంబంధించిన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణించబడుతుంది. నమూనా సేకరణ నుంచి ఫలితాల విశ్లేషణ, నివేదికల వరకు అన్ని ప్రక్రియలు ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నట్లు ఈ గుర్తింపు ధృవీకరిస్తుంది.
ఈ సందర్భంగా తుంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ మాట్లాడుతూ, “25 ఏళ్ల క్రితం ఈ ప్రాంత ప్రజలు విశ్వసించే ప్రయోగశాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రారంభించాం. ఇప్పుడు థంబే ల్యాబ్స్‌ను యూఏఈ నుంచి జీసీసీ దేశాలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించే గ్లోబల్ డయాగ్నస్టిక్ బ్రాండ్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని తెలిపారు.
థంబే ల్యాబ్స్‌లో క్లినికల్ కెమిస్ట్రీ, హీమటాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, హిస్టోపాథాలజీ, న్యూబోర్న్ స్క్రీనింగ్, ఆక్యుపేషనల్ హెల్త్ తదితర విభాగాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా నవజాత శిశువుల్లో జన్యు, మెటబాలిక్ వ్యాధులను ముందుగానే గుర్తించే కార్యక్రమంలో ఈ సంస్థ ఉత్తర ఎమిరేట్స్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.
సాంకేతికతను మరింత విస్తరించేందుకు తుంబే ల్యాబ్స్ త్వరలో మొబైల్ యాప్, వెబ్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ద్వారా రోగులు ఆన్‌లైన్‌లో పరీక్షలు బుక్ చేసుకోవడం, చెల్లింపులు చేయడం సులభమవుతుంది. అలాగే ఇంటి వద్దే నమూనాల సేకరణ సేవలను అబుదాబికి విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
అదనంగా, అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే రక్త పరీక్షలను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తుంబే ల్యాబ్స్ వెల్లడించింది. కృత్రిమ మేధస్సు (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్ ఆధారంగా రూపొందించిన “ల్యాబ్ 5.0” మోడల్ ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి మరింత ఖచ్చితమైన చికిత్స అందించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.
యూఏఈ ఆరోగ్య రంగంలో నాణ్యత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన తుంబే ల్యాబ్స్, 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానంతో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్‌లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







