తల్లిని చంపిన 29 ఏళ్ళ మానసిక రోగి

- August 10, 2016 , by Maagulf
తల్లిని చంపిన 29 ఏళ్ళ మానసిక రోగి

50 ఏళ్ళ తల్లిని చంపిన తనయుడి విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా పలు వైద్య పరీక్షలు నిందితుడికి నిర్వహించగా, నిందితుడు మానసిక రోగి అని తేలింది. లెబనీస్‌ మూలాలున్న డానిష్‌కి చెందిన తన తల్లిని తానే చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అల్‌ మంజార్‌ ప్రాంతంలోని అల్‌ నఖ్లా టవర్‌లో తల్లితో కలిసి నిందితుడు నివసించేవాడు. తల్లిని చంపేసి, ఇంట్లోనే దాచిపెట్టాడు నిందితుడు. ఓ సూపర్‌ మార్కెట్‌లో నిందితుడు దొంగతనం చేయగా, అతని కోసం ఇంటికి వెళ్ళిన వారికి ఇంట్లో దాచి వుంచిన మహిళ మృతదేహం కన్పించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గతంలోనూ నిందితుడు, మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స పొందినట్లు పోలీసులు విచారణ అనంతరం వెల్లడించారు. నిద్రపోతున్న సమయంలో నిందితుడు తన తల్లిని గొంతు కోసి చంపేశాడు. చేసిన పని పట్ల తాను చింతించడంలేదనీ, ఆ సమయంలో పూర్తి స్పృహతోనే ఉన్నానని నిందితుడు చెప్పాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com