తల్లిని చంపిన 29 ఏళ్ళ మానసిక రోగి
- August 10, 2016
50 ఏళ్ళ తల్లిని చంపిన తనయుడి విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా పలు వైద్య పరీక్షలు నిందితుడికి నిర్వహించగా, నిందితుడు మానసిక రోగి అని తేలింది. లెబనీస్ మూలాలున్న డానిష్‌కి చెందిన తన తల్లిని తానే చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అల్ మంజార్ ప్రాంతంలోని అల్ నఖ్లా టవర్‌లో తల్లితో కలిసి నిందితుడు నివసించేవాడు. తల్లిని చంపేసి, ఇంట్లోనే దాచిపెట్టాడు నిందితుడు. ఓ సూపర్ మార్కెట్లో నిందితుడు దొంగతనం చేయగా, అతని కోసం ఇంటికి వెళ్ళిన వారికి ఇంట్లో దాచి వుంచిన మహిళ మృతదేహం కన్పించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గతంలోనూ నిందితుడు, మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స పొందినట్లు పోలీసులు విచారణ అనంతరం వెల్లడించారు. నిద్రపోతున్న సమయంలో నిందితుడు తన తల్లిని గొంతు కోసి చంపేశాడు. చేసిన పని పట్ల తాను చింతించడంలేదనీ, ఆ సమయంలో పూర్తి స్పృహతోనే ఉన్నానని నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







