అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- June 23, 2026
కువైట్: ప్రవాస కార్మికులు నమోదు చేసుకున్న విద్యా అర్హతలు మరియు వృత్తులను సవరించుకోవడానికి అనుమతించే కొత్త నిబంధనలను కువైట్ ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ అయిన షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
కార్మికుల ధృవపత్రాలు మరియు ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నట్లయితే, వారి విద్యా అర్హతలు లేదా వృత్తిపరమైన హోదాలలో మార్పులను ఈ సర్క్యులర్ అనుమతిస్తుంది. నమోదైన అర్హతలకు, ఉద్యోగులు కార్యాలయంలో నిర్వర్తించే విధులకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌లోని వర్గాలు తెలిపాయి. డైరెక్టర్-జనరల్ ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ నేతృత్వంలో లేబర్ ఇండస్ట్రిని నియంత్రించడానికి, యజమానులు-కార్మికుల హక్కుల మధ్య సమతుల్యం పాటిస్తూనే వివిధ ఆర్థిక రంగాల వాస్తవ అవసరాలను పెంపొందించడంలో ఈ నిర్ణయం ఒక భాగమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త నిబంధనలు జూన్ 2 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







